సవ్యసాచి వైనాట్ సాంగ్.. కీరవాణి ట్రెండీ మ్యూజిక్..!

October 09, 2018


img

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. నవంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. వై నాట్ అంటూ కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ పాటకి అనంత శ్రీరాం సాహిత్యం అందించడం జరిగింది.

రీసెంట్ గా శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఆ సినిమాతో అంచనాలను అందుకోలేదు. చందు మొండేటి సవ్యసాచి మీద మాత్రం అంచనాలు బాగున్నాయి. ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన టీజర్ ప్రేక్షకులను అలరించింది. ఇక మొదటి సాంగ్ గా వచ్చిన వై నాట్ కూడా కీరవాణి ట్రెండీ మ్యూజిక్ తో అలరించింది. మరి చైతుకి ఈ సినిమా అయినా హిట్ కిక్ ఇస్తుందో లేదో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష