ప్రభాస్ నెక్స్ట్ టైటిల్ ఫిక్స్..!

October 08, 2018


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేసేలా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న సాహో సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. 

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా కన్ఫాం చేశాడు. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమా ఓ లవ్ స్టోరీగా ఉంటుందట. అందుకే ఈ సినిమాకు అమూర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. అమూర్ ఇది తెలుగు టైటిల్ లా అనిపించడం లేదే అంటే.. ఇదో ఫ్రెంచ్ పదమని తెలుస్తుంది.   

సినిమా అంతా యూరప్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందట. అందుకే సినిమాకు అక్కడ టైటిల్ పెట్టారట. అయితే సినిమాలో టైటిల్ కన్విన్స్ అయ్యేలా సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. అయితే అమూర్ అంటే తెలుగులో ప్రేమ అని అర్ధం. సో ప్రభాస్ ఓ క్రేజీ లవ్ స్టోరీకి రెడీ అవుతున్నాడన్నమాట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష