ప్రతినాయకుడి పాత్రలో బాలకృష్ణ

September 22, 2018


img

నందమూరి బాలకృష్ణ ఏంటి విలన్ గా నటించడం ఏంటి.. ఇది కచ్చితంగా షాక్ అవ్వాల్సిన న్యూసే.. అయితే ఇది ఎవరి ఆలోచనో కాదు స్వయంగా బాలయ్య ఆలోచనే. నందమూరి నటసింహంగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన బాలకృష్ణ ప్రతినాయకుడి పాత్రలో నటించాలని ఉంది అంటున్నాడు. రీసెంట్ గా సైమా వేడుకల్లో బాహుబలి విలన్ గా రానా అందుకున్న అవార్డ్ ఇస్తూ బాలయ్య అన్న మాటలివి.  

తనకు విలన్ గా చేయాలని అనిపించినా ఫ్యాన్స్ ఒప్పుకోరు అంటున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటిస్తున్న బాలకృష్ణ ఆ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు దాదాపు 60 డిఫరెంట్ గెటప్పులలో కనిపిస్తాడని తెలుస్తుంది.  

ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో బాలకృష్ణ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.  



Related Post

సినిమా స‌మీక్ష