రష్మిక చేతి టాటూ కహాని..!

September 21, 2018


img

కన్నడ భామ రష్మిక తెలుగులో మంచి ఫాంలో ఉంది. ఛలో, గీతా గోవిందం రెండు వరుస సూపర్ హిట్లు అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో లక్కీ హ్యాండ్ గా మారింది. లేటెస్ట్ గా దేవదాస్ సినిమాతో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ ఆడియో వేడుకలో రష్మిక తన లుక్స్ తో అలరించింది. అయితే కొన్నాళ్లుగా రష్మికను ఫాలోవుతున్న ఆడియెన్స్ ఆమె చేతికి ఉన్న టాటూ మీద పడ్డారు.  

రష్మిక చేతి మీద ఇంగ్లీష్ లో టాటూ వేయించింది. అది ఇర్రిప్లేసబుల్ అని రాయించుకుంది రష్మిక. చివరి ఈ లెటర్ మీద లవ్ సింబల్ ఉంది. ఇక దాని అర్ధం ఏంటంటే ఇంపాజిబుల్ టూ రీప్లేస్ అనే అర్ధం వచ్చేలా ఇర్రిప్లేసబుల్ అని చేతి మీద రాయించుకుంది. రష్మిక ఈ పదాన్ని చేతి మీద రాసుకోడాని గల కారణాలు ఏంటన్నది మాత్రం తెలియలేదు. రిలీజ్ కాబోతున్న దేవదాస్ సినిమా కూడా సక్సెస్ అయితే ఇక రష్మికకు తిరుగులేదని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష