అర్జున్ రెడ్డి రన్ టైం తగ్గించారా..?

September 21, 2018


img

సందీప్ వంగ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. ఏమాత్రం అంచలాలు లేకుండా వచ్చిన ఈ సినిమా స్టార్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి భారీ కలక్షన్స్ సాధించింది. అంతేకాదు సినిమా కథ, కథనాలు మిగతా స్టార్ హీరోలందరు షాక్ అయ్యేలా చేశాయి. ఆ తర్వాత గీతా గోవిందంతో కూడా విజయ్ సంచలన విజయం అందుకున్నాడు.

ఇదిలాఉంటే అర్జున్ రెడ్డి రీమేక్ గా తమిళంలో వర్మ సినిమా తెరకెక్కుతుంది. విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను బాలా డైరెక్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 23 ధ్రువ్ పుట్టినరోజు సందర్భంగా వర్మ సినిమా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారట. అర్జున్ రెడ్డి సినిమా 3 గంటల 6 నిమిషాల రన్ టైం తో వచ్చింది. అయినా సరే సంచలన విజయం అందుకుంది. 

అయితే తమిళ అర్జున్ రెడ్డి అదేనండి వర్మ సినిమా రన్ టైం 3 గంటలు ఉంటుందా లేక రెండున్నర గంటల్లోనే ముగించేస్తరా అన్నది తెలియాల్సి ఉంది. ధ్రువ్ డెబ్యూ మూవీగా వర్మ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసేలా చూస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష