దేవదాస్ ట్రైలర్ : కామెడీ కుమ్మేశారు..!

September 20, 2018


img

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు. ఈ సినిమా ఆడియో కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సినిమాలో డాన్ దేవాగా నాగార్జున, డాక్టర్ దాసుగా నాని కనిపిస్తున్నారు.

దాసు పేషెంట్ అయిన డాన్ దేవా ఆ డాక్టర్ కు వచ్చిన ప్రాబ్లెంను ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా కథ. ట్రైలర్ మొత్తం చాలా కామెడీగా కట్ చేశారు. చూస్తుంటే నాగ్, నానిలు కలిసి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ ఇచ్చేలా అనిపిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 

 Related Post

సినిమా స‌మీక్ష