బిగ్ బాస్ ను క్యాష్ చేసుకుంటున్న సంపూ..!

September 20, 2018


img

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ సంచలనాలు అందరికి తెలిసిందే. హృదయ కాలెయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంపూ తన వంతుగా ఆడియెన్స్ ను అలరించేందుకు కృషి చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 1 లో సంపూ హంగామా తెలిసిందే. ఇంట్లో తన వల్ల కాదని మధ్యలోనే హౌజ్ ను వదిలి వెళ్లాడు. ప్రస్తుతం కొబ్బరిమట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంపూర్ణేష్ బాబు ఈ సినిమా ప్రమోషన్స్ లో బిగ్ బాస్ టీం ను వాడేస్తున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 2 ఆసక్తికరంగా సాగుతున్న ఈ టైంలో బిగ్ బాస్ మొదటి సీజన్ టీం అంతా కొబ్బరిమట్ట ఆడియోకి వచ్చేలా ప్లాన్ చేశాడు సంపూర్ణేష్. ఇది కచ్చితంగా బిగ్ బాస్ ఫ్యాన్స్ కు నచ్చే విషయమే. సీజన్ 2 హాట్ హాట్ గా సాగుతున్న ఈ తరుణంలో సీజన్ 1 కంటెస్టంట్స్ ఒకచోట రీయూనియన్ అవడం సీజన్ 2కి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష