ఇలాంటి టైంలో మన సత్తా తెలుస్తుంది : రానా

September 20, 2018


img

దగ్గుబాటి రానా హీరో అనిపించుకోవడం కన్నా నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తాడు. అందుకే హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గా వచ్చిన అవకాశాలను వదలకుండా చేశాడు. బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ గా ఎంత పర్ఫెక్ట్ అనిపించుకున్నాడో విలన్ గా రానా తప్ప మరెవరిని ఊహించుకోలేం ఆ సినిమాతో నేషనల్ వైడ్ గా కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు రానా. 

ఇక ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబుగా నటిస్తున్నాడు రానా. కల్పిత పాత్రల కన్నా రియల్ లైఫ్ వ్యక్తుల పాత్రలను నటించడం సాహసంగా అనిపిస్తుందని అంటున్నాడు రానా. నటుడిగా మన సత్తా ఏంటన్నది అలాంటి పాత్రల్లో నటిస్తేనే తెలుస్తుందని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు పాత్ర పోశించడం ఛాలెంజింగ్ గా స్వీకరించానని చెబుతున్నాడు రానా.



Related Post

సినిమా స‌మీక్ష