నోటా రిలీజ్ కు కొత్త తలనొప్పి..!

September 19, 2018


img

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతున్న సినిమా నోటా. ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవెల్ రాజా నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ మారిందని అంటున్నారు. అసలైతే అక్టోబర్ 4 అనుకున్న నోటా అదే నెల 18కి వాయిదా పడిందట. అయితే ఈ సినిమాకు తెలుగు మాటలు అందించిన శశాంక్ వెన్నెలకంటి సినిమా రిలీజ్ ఆపేస్తా అంటున్నాడు.

నోటా సినిమా తెలుగు వర్షన్ డైలాగ్స్ శశాంక్ రాశాడట. అయితే తెలుగు వర్షన్ లో కూడా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరక్షన్ ఇలా అన్ని విభాగాల్లో దర్శకుడు ఆనంద్ శంకర్ తన పేరు వేసుకున్నాడు. దీనికి శశాంక్ చాలా సీరియస్ అవుతున్నారు. తన రెమ్యునరేషన్ సెట్ చేసేంతవరకు సినిమా రిలీజ్ కూడా ఆపేస్తా అంటున్నాడు శశాంక్. 



Related Post

సినిమా స‌మీక్ష