అఖిల్ వచ్చేది అప్పుడేనా..!

September 18, 2018


img

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. తొలిప్రేమతో దర్శకుడిగా మొదటి సినిమా హిట్ అందుకున్న వెంకీ అట్లూరి రెండో సినిమాగా చేస్తున్న ఈ మూవీకి మిస్టర్ మజ్ ను అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

అఖిల్ 3వ సినిమాగా భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీని అసలైతే డిసెంబర్ 21న రిలీజ్ చేయాలని అనుకున్నారు. మళ్లీ ఏమైందో ఏమో కాని సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాపై అఖిల్ పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తుందట. మరి అఖిల్ తొలిప్రేమ దర్శకుడితో చేస్తున్న ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.   



Related Post

సినిమా స‌మీక్ష