విజయ్ 'నోటా' రిలీజ్ వాయిదా..?

September 18, 2018


img

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను అసలైతే అక్టోబర్ 4న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అనుకున్న టైం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే అవకాశం లేదని సినిమా రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో కే.ఇ. జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న ఈ నోటా సినిమాకు తెలుగులో కూడా క్రేజ్ ఏర్పడింది.    

గీతా గోవిందం తర్వాత విజయ్ నుండి వస్తున్న సినిమా కాబట్టి నోటాపై భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిఎంగా కనిపిస్తాడని తెలుస్తుంది. అక్టోబర్ 4 అనుకున్న ఈ సినిమా రెండు వారాల తర్వాత అంటే అక్టోబర్ 18న రిలీజ్ ఫిక్స్ చేస్తున్నారట. దసరా బరిలో అప్పటికే అక్టోబర్ 18న రామ్ హలో గురు ప్రేమ కోసమే.. విశాల్ పందెం కోడి-2 ఆ డేట్ న వస్తున్నాయి. మరి నోటా కూడా అదే రోజున వస్తే మూడు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. అక్టోబర్ 11 మాత్రం ఎన్.టి.ఆర్ అరవింద సమేత రిలీజ్ ఫిక్స్ అంటున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష