హలో గురు ప్రేమ కోసమే టీజర్.. రామ్, అను రొమాంటిక్ టచ్

September 17, 2018


img

నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూస్తే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుందని చెప్పొచ్చు. రామ్ సరసన అనుపమ పరమేశ్వర నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

చూశావా.. నీ కోసమే.. అంటూ వెనుక తిరిగి ఉన్న హీరోయిన్ అంటే.. ఆమె వెనుక భాగం చూస్తూ స్టన్ అవుతాడు హీరో.. ఇటు తిరిగి కాఫీ అని చెప్పగా.. ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు హాట్ గా ఉంది అంటాడు రామ్. అనుపమ ఇదవరకు సినిమాల కన్నా ఇందులో హాట్ లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. నేను లోకల్ తర్వాత త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దసరా సీజన్ లో దమ్ము చూపించేందుకు వస్తున్న రామ్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.      





Related Post

సినిమా స‌మీక్ష