ఓవర్సీస్ లో 20 కోట్లు.. ఎన్టీఆర్ బయోపిక్ డిమాండ్

September 14, 2018


img

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ మొదలుపెట్టిన సినిమా ఎన్.టి.ఆర్. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ భారీ రేంజ్ లో జరుగుతుంది. నటుడిగా, రాజకీయవేత్తగా తెలుగు జాతి చరిత్రలో చెరుగని ముద్ర వేసుకున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక్క ఓవర్సీస్ రైట్సే 20 కోట్ల దాకా పలుకుతున్నాయట.

ఓవర్సీస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్.టి.ఆర్ బయోపిక్ ను 20 కోట్ల దాకా కోట్ చేశారట. ఈ లెక్కన ఎన్.టి.ఆర్ బయోపిక్ 100 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది. సినిమాలో చంద్రబాబుగా రానా, ఏయన్నార్ గా సుమంత్, హరికృష్ణగా కళ్యాణ్ రాం నటిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. 2019 సంక్రాంతి బరిలో దిగేలా ప్లాన్ చేస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష