7 కోట్ల యూటర్న్.. ఎంత రాబట్టింది

September 14, 2018


img

సమంత లీడ్ రోల్ లో కన్నడ రీమేక్ గా వచ్చిన సినిమా యూటర్న్. కన్నడ దర్శకుడు పవన్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 7 కోట్లు చేసింది. అయితే సమంతకు ఉన్న క్రేజీ ఫాలోయింగ్ తో మొదటి రోజే యూటర్న్ కోటి 10 లక్షలు కలెక్ట్ చేయడం విశేషం.  

సినిమాకు పాజిటివ్ రావడంతో సినిమా కచ్చితంగా వీకెండ్ లోనే లాభాల బాట పట్టేస్తుందని అంటున్నారు. మరో వారం దాకా ఎలాగు ఏ సినిమా పోటీగా ఉండదు కాబట్టి యూటర్న్ సమంతకు సేఫ్ ప్రాజెక్టే అని అంటున్నారు. ఇక గురువారం యూటర్న్ కు పోటీగా చైతు శైలజా రెడ్డి అల్లుడు కూడా రిలీజ్ అయ్యింది. మారుతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా మొదటి రోజు 7 కోట్ల పైగా వసూళ్లను రాబట్టి చైతు స్టామినా ప్రూవ్ చేసింది.Related Post

సినిమా స‌మీక్ష