రష్మికతోనే ఛలో అంటున్నాడు..!

September 14, 2018


img

కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన తెలుగులో ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమా కూడా అమ్మడికి క్రేజీ హిట్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలతో తెలుగులో రష్మిక పాపులారిటీ పెరిగింది. అందుకే ఇప్పుడు ఆమె వెంట దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటిస్తున్న రష్మిక ఖాతాలో మరో లక్కీ ఛాన్స్ వచ్చి చేరింది. 

ఛలో సినిమాతో ప్రతిభ చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల తన రెండో సినిమాగా నితిన్ తో చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్ననే సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. వెంకీ ఆల్రెడీ ఛలోలో రష్మిక అలరించింది. కెరియర్ లో చాలా వెనుకపడ్డ నితిన్ రష్మిక లక్ తోడై ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష