జగన్ పుట్టినరోజున 'యాత్ర' రిలీజ్

September 13, 2018


img

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న మూవీ యాత్ర. జననేతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆ మహానేత జీవిత కథతో సినిమా అంటే ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. రీసెంట్ గా ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ అంచనాలు పెంచగా ఆ తర్వాత వచ్చిన సాంగ్ కూడా వైఎస్ అభిమానులను అలరించింది. ఈ సినిమా 2019 జనవరిలో రిలీజ్ అనుకోగా ఈ సంవత్సరం చివర్లోనే రిలీజ్ ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు. 

డిసెంబర్ 21న వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాత్ర సినిమా రిలీజ్ కానుందట. జనవరిలో రిలీజ్ అంటే సంక్రాంతికి పెద్ద సినిమాలతో క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే సంక్రాంతికి మూడు వారాల ముందే యాత్ర మూవీని రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో వైఎస్సార్ గా మళయాల స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. 

70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మిస్తున్నారు. మహి వి రాఘవ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది.    
Related Post

సినిమా స‌మీక్ష