2.ఓ టీజర్.. అరుపులు పెట్టించేసింది

September 13, 2018


img

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న సినిమా 2.ఓ. కొన్నాళ్లుగా టీజర్ రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయ్యింది. లైకా ప్రొడక్షన్స్ లో 450 కోట్ల పైగా బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ టీజర్ ఉంది.

గ్రాఫిక్స్ వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. 2.ఓ టీజర్ అరుపులు కేకలే అన్నట్టుగా ఉంది. రజిని అభిమానుల ఆకలి తీర్చేలా 2.ఓ సంచలనం సృష్టించనుంది అని చెప్పడానికి వచ్చిన ఈ శాంపిల్ టీజర్ సంచలనంగా మారింది. టీజర్ లో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా వస్తుందేమో చూడాలి.
Related Post

సినిమా స‌మీక్ష