మిల్కీ అందాలతో చైతు స్పెషల్ ట్రీట్

September 12, 2018


img

అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సెప్టెంబర్ 13 గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత చందు మొండేటి డైరక్షన్ లో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు చైతన్య. స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మిల్కీ అందాలను బోనస్ గా యాడ్ చేస్తున్నారట.

సవ్యసాచి సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తుందట. నాగార్జున అల్లరి అల్లుడు సినిమాలోని నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు సాంగ్ రీమిక్స్ గా ఈ పాట ఉంటుందట. చైతుతో తమన్నా ఈ సాంగ్ కు స్టెప్పులేస్తుందని తెలుస్తుంది. హీరోయిన్ గా చేస్తూనే స్పెషల్ సాంగ్స్ లో తమన్నా స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ పాటలో వేరే హీరోయిన్స్ ట్రై చేయగా తమన్నా అయితేనే పర్ఫెక్ట్ అని ఆమెను ఓకే చేశారట. మరి చైతు, తమన్నాల సయ్యాట ఎలా ఉంటుందో చూడాలంటే సవ్యసాచి రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. Related Post

సినిమా స‌మీక్ష