అరవింద మీద ఆశలు పెట్టుకున్నాడు..!

September 12, 2018


img

స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. కమెడియన్ గా బ్రహ్మానందంను కొట్టేసిన సునీల్ హీరోగా మారి తన కెరియర్ అటకెక్కేలా చేసుకున్నాడు. ఈమధ్య సునీల్ హీరోగా చేసిన సినిమాలు కనీసం కొనేందుకు ఎవరు సాహసం చేయలేదు. అందుకే లేట్ గా అయినా లేటెస్ట్ గా మళ్లీ కమెడియన్ గా తన పాత పంథా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి టైంలో తన స్నేహితుడు త్రివిక్రం ఓ క్రేజీ ఛాన్స్ ఇచ్చాడు.

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న అరవింద సమేత సినిమాలో సునీల్ నటిస్తున్నాడు. ఎన్.టి.ఆర్, సునీల్ మధ్య సీన్స్ చాలా బాగుంటాయట. రీసెంట్ గా వచ్చిన అల్లరి నరేష్ సిల్లీ ఫెలోస్ కూడా సునీల్ కు నిరాశ మిగల్చగా అరవింద సమేత మాత్రం సునీల్ ను మళ్లీ స్టార్ కమెడియన్ ను చేసేస్తుందని అంటున్నారు. సినిమాలో ఎన్.టి.ఆర్ గురువుగా సునీల్ కనిపిస్తాడట. మరి సునీల్ ఆశలు పెట్టుకున్న ఎన్.టి.ఆర్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష