ఎన్టీఆర్ లో చంద్రబాబు లుక్ ఇదే..!

September 12, 2018


img

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో నారా చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. సినిమాలో ఆయన లుక్స్ ఈమధ్య సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే ఎలాగు లీకయ్యాయి అనుకున్నారో ఏమో కాని సినిమాలో చంద్రబాబు ఎలా ఉంటాడో ఫస్ట్ లుక్ రూపంలో చూపించేశారు. బాబు గారిగా రానా అదరగొట్టాడని ఫస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తుంది.


బాహుబలిలో భళ్లాలదేవాగా అదరగొట్టిన రానా ఎన్.టి.ఆర్ బయోపిక్ కోసం నారా బాబుగా మారడం విశేషం. ఈ మేకోవర్ కేవలం రానా వల్లే సాధ్యం అనేలా అతని లుక్ ఉంది. సినిమా పాత్ర ఎలాంటిదైనా దానికి తగినట్టుగా తన బాడీ షేప్ మార్చుకునే రానాని కచ్చితంగా అభినందించాల్సిందే. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో చంద్రబాబుగా రానా ఎలాంటి నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష