బావకి సపోర్ట్ గా మహేష్ ట్వీట్..!

September 11, 2018


img

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుధీర్ బాబుకు సపోర్ట్ గా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు. రొటీన్ కు భిన్నంగా సుధీర్ ప్రయోగాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. లేటెస్ట్ గా సుధీర్ బాబు సొంత బ్యానర్ స్థాపించి అందులో మొదటి సినిమా తానే హీరోగా చేస్తున్నాడు. నన్ను దోచుకుందువటే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను ఆర్.ఎస్ నాయుడు డైరెక్ట్ చేస్తున్నారు.    

రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో కామెడీ, పంచులు అదిరిపోయాయి. ఇక లేటెస్ట్ గా ఈ ట్రైలర్ పై సూపర్ స్టార్ మహేష్ తన రెస్పాన్స్ తెలియచేశాడు. నిర్మాతగా సుధీర్ తొలి ప్రయత్నానికి బెస్ట్ విషెష్ అని చెప్పిన మహేష్.. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది.. ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశారు. చూస్తుంటే మహేష్ ఇచ్చిన బూస్టింగ్ నన్ను దోచుకుందువటే ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యిందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 21న థియేటర్ కు వెళ్లమని కూడా మహేష్ చెప్పడం సినిమాకు మరింత ఎంకరేజ్ మెంట్ ఇస్తుందని చెప్పొచ్చు.        Related Post

సినిమా స‌మీక్ష