వైఎస్సార్ 'యాత్ర' ఎక్కడ ఉందంటే..!

August 18, 2018


img

దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో వస్తున్న సినిమా యాత్ర. వైఎస్ పాదయాత్ర నేపథ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టి కథ రాసుకున్నాడు దర్శకుడు మహి వి రాఘవ అందుకే సినిమాకు యాత్ర అనే టైటిల్ పెట్టారు. సినిమాలో వైఎస్సార్ గా మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు. ఈమధ్యనే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ వైఎస్ అభిమానులకే కాదు సిని ప్రేమికులను ఆకట్టుకుంది.

వైఎస్ జీవిత కథను సినిమాగా చెప్పే ప్రయత్నంలో భాగంగా వస్తున్న యాత్ర మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ భారీ అంచనాలు పెంచింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఫేమ్స్ మ్యూజిక్ ప్రాజెక్ట్ ద్వారా ఈ సినిమా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సినిమా మ్యూజిక్ విషయంలో కూడా చిత్ర దర్శక నిర్మాతలు ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది.     

ఇక యాత్ర సినిమా రిలీజ్ కూడా 2019 జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుందట. లాస్ట్ ఇయర్ ఆనందో బ్రహ్మ సినిమాతో ప్రతిభ చాటుకున్న మహి వి రాఘవ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ప్రెస్టిజియస్ గా మూవీని నిర్మిస్తున్నారు. టీజర్ తో బయోపిక్ ఎలా ఉంటుందో రుచి చూపించిన దర్శక నిర్మాతలు సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట.   



Related Post

సినిమా స‌మీక్ష