ఎన్టీఆర్ సినిమాలో చిరంజీవి ఎవరు..?

August 17, 2018


img

తండ్రి బయోపిక్ గా బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ సినిమాలో ఇప్పటికే సగానికి పైగా కాస్టింగ్ రివీల్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో చిరంజీవిగా వరుణ్ ఛాన్స్ అందుకున్నాడట. కాని ఆ ఆఫర్ ను వరుణ్ తేజ్ సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తుంది. క్రిష్ కంచె సినిమాలో హీరోగా నటించిన వరుణ్ తేజ్ అతని ఆఫర్ ను కాదన్నాడు.

చిరు రోల్ అనగానే మెగా ఫ్యాన్స్ చేస్తే చరణ్ చేయాలి అంటారు. వరుణ్ తేజ్ చేసినా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉన్నా ఫ్యాన్స్ నెగటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకూడదని ముందే క్రిష్ కు సారీ చెప్పేశాడట వరుణ్ తేజ్. అయితే ప్రేక్షకుల్లో కొంతమంది చిరు రోల్ కు వరుణ్ కన్నా సాయి ధరం తేజ్ ను తీసుకుంటే బెటర్ అని సలహా ఇస్తున్నారు. మరి తేజూని అయినా చేయనిస్తారా లేదా అన్నది చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష