యూటర్న్ ట్రైలర్ టాక్..!

August 17, 2018


img

సౌత్ లో టాప్ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూ సత్తా చాటిన సమంత మొదటిసారి ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ మూవీ చేసింది. అదే యూటర్న్ సినిమా. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఏరికోరి మరి సమంత చేస్తుందన్న విషయం తెలిసిందే. మాత్రుక దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది.

ట్రైలర్ చూశాక సమంత ఎందుకు ఈ సినిమాపై అంత ఆసక్తి చూపించిందో అర్ధమవుతుంది. మర్డర్ మిస్టరీతో కూడిన సస్పెన్స్ సినిమా ఆద్యంతం కంటిన్యూ చేస్తూ దర్శకుడు ట్రైలర్ తోనే సినిమా డెప్త్ ఏంటో తెలియచేశాడు. కచ్చితంగా సమంత ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చేస్తుంది. రొటీన్ కు భిన్నంగా పాత్రల ఎంపికతో ప్రేక్షకులను అలరిస్తూ పెళ్లి తర్వాత కూడా సమంత కెరియర్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది. పెళ్లి తర్వాత వచ్చిన అన్ని సినిమాలు అమ్మడికి సూపర్ హిట్ ఇచ్చాయి. ఆ క్రమంలో ఈ యూటర్న్ కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని ఆశిద్దాం.





Related Post

సినిమా స‌మీక్ష