జోగి నాయుడు రెండో పెళ్లి..!

August 17, 2018


img

జోగి బ్రదర్స్ షోతో పాపులర్ అయిన జోగి నాయుడు ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. జోగి నాయుడు యాంకర్ ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యాంకర్ గా ఝాన్సీ ఫుల్ ఫాంలో ఉన్నప్పుడు జోగి నాయుడు కూడా బుల్లితెర మీద రకరకాల షోస్ చేసేవాడు. ప్రేమ.. పెళ్లి అంతా జరిగాక వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటికే వీరికో పాప ఉన్నా సరే ఆమె కోసమైనా కలిసి ఉండాలన్న ఆలోచన చేయకుండా కోర్ట్ ద్వారా డైవర్స్ తీసుకున్నారు. ఈమధ్య ఝాన్సీ కూడా యాంకరింగ్ కు దూరంగా ఉంది. దానికి కారణం కూడా ఇదే అని తెలుస్తుంది.

ఇక ఈరోజు సడెన్ గా జోగి నాయుడు తన స్వగ్రామం చెర్లో పాలెం కు చెందిన సౌజన్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. జోగి నాయుడు, ఝాన్సీ విడిపోడానికి కారణాలు తెలియవు కాని ఈరోజు ఝాన్సీకి మాత్రం ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఈమధ్యనే ఝాన్సీ వరుసగా సినిమా ప్రొగ్రామ్స్ చేస్తుంది. సుమ తర్వాత భాష మీద అంత పట్టు ఉన్న యాంకర్ అంటే కచ్చితంగా ఝాన్సీ అని చెప్పొచ్చు.   



Related Post

సినిమా స‌మీక్ష