ఎన్టీఆర్ మళ్లీ అతనితోనే..!

August 16, 2018


img

అరవింద సమేత తర్వాత ఎన్.టి.ఆర్ రాజమౌళి డైరక్షన్ లో చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత సినిమాను లైన్ లో పెట్టాడు ఎన్.టి.ఆర్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ కొరటాల శివతో సినిమా చేస్తాడని అంటున్నారు. 

ఇప్పటికే కొరటాల శివ డైరక్షన్ లో జనతా గ్యారేజ్ సినిమాతో హిట్ అందుకున్నాడు ఎన్.టి.ఆర్. అంతేకాదు రచయితగా బృందావనంకు కలిసి పనిచేశారు. అందుకే జక్కన్న సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ మళ్లీ కొరటాల శివకే ఓటేశాడు. ప్రస్తుతం కొరటాల శివ కూడా మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ లో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష