ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా..!

August 16, 2018


img

బిగ్ బాస్ సీజన్ 2 ఈమధ్య ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచింది. నాని వచ్చిన శని, ఆదివారాలే కాదు సోమవారం నుండి శుక్రవారం వరకు కూడా ఆడియెన్స్ ను అలరిస్తున్నారు కంటెస్టంట్స్. ఇక గత రెండు రోజులుగా జరుగుతున్న టెలికాలర్స్ వర్సెస్ కస్టమర్స్ టాస్కులో గణేష్, దీప్తి సునైనా, గీతా కౌశల్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. గీతా కాస్త కూస్తో కౌశల్ ఆమె నామినేషన్ కు సంబంధించిన విషయాలను ప్రస్థావించింది కాని దీప్తి, గణేష్ లు అలా కాదు. కాస్త ఓవర్ రియాక్ట్ అయ్యారు.

దీప్తి సునైనా అయితే తూ.. బిగ్ బాస్ హౌజ్ కు ఎందుకొచ్చావ్ అసలు అంటూ దుర్భాషలాడింది. అలా చేసిందో లేదో ఈ వారం కౌశల్ ఆర్మీ టార్గెట్ దీప్తి సునైనా అయ్యింది. బయట ఉన్న కౌశల్ ఆర్మీ గురించి తక్కువ అంచనా వేసిన దీప్తి సునైనా కౌశల్ ను టర్గెట్ చేసింది. ఈసారి దీప్తి సునైనా ఎలిమినేషన్ గ్యారెంటీ అనేలా ఓటింగ్స్ చేస్తున్నారు. మరి ఈ వారం కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్ దీప్తికి ఏమేరకు పడుతుంది అన్నది ఆదివారం వరకు వేచి చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష