సైరా టీజర్ అప్పుడే..!

August 15, 2018


img

ఖైది నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతుంది. 


ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. అది కూడా సినిమా ఎనౌన్స్ మెంట్ రోజే వచ్చే సరికి మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు సైరా టీం ప్రేక్షకులను విష్ చేస్తూ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగష్టు 21న ఉదయం 11:30 గంటలకు సైరా టీజర్ వస్తుందట. టీజర్ తో సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపిస్తారట. మరి సైరా అంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష