సింగర్ మంగ్లీకి సూపర్ ఛాన్స్..!

August 15, 2018


img

తెలంగాణా ప్రతి పండుగకు పాట పాడి సంగీత ప్రియులను అలరిస్తున్న మంగ్లీ రేలారేలారే అంటూ చేసిన హంగామా అందరికి తెలిసిందే. ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ కు మన్ల్గీ పాడే పాటలు చాలా పాపులర్. ఆమెలోని సింగింగ్ టాలెంట్ తో సొంతంగా ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న మంగ్లీకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఇన్నాళ్లు సొంత ఆల్బంస్ చేసిన మంగ్లీకి సినిమా పాట పాడే అవకాశం వచ్చిందట.

అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో మంగ్లీ ఓ పాట పాడిందట. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అత్త, భార్యల మధ్య నలిగే సన్నివేశంలో ఓ పాట వస్తుందట. ఆ టైంలో వచ్చే పాట మంగ్లీ పాడిందట. టైటిల్ సాంగ్ గా వస్తున్న ఈ పాటతో మంగ్లీ సిల్వర్ స్క్రీన్ పై కూడా సత్తా చాటడం ఖాయమని అంటున్నారు.  Related Post

సినిమా స‌మీక్ష