మహేష్ సినిమాలో సీనియర్ హీరో సస్పెన్స్..!

August 14, 2018


img

భరత్ అనే నేను హిట్ తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. మహేష్ 25వ సినిమాగా ఈ మహర్షి చాలా ప్రత్యేకత చోటు చేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో మరో సినిమా లైన్ లో పెట్టాడు. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి 1 నేనొక్కడినే సినిమా చేశారు. కాని ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ డైరక్షన్ లో మహేష్ 26వ సినిమా వస్తుంది. ఈ సినిమాలో ఓ 20 నిమిషాల రోల్ లో సీనియర్ హీరో కనిపిస్తాడట. సినిమాకు ఆ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని.. కథను మార్చే పాత్రలో ఓ సీనియర్ స్టార్ హీరో నటిస్తాడని అంటున్నారు. మరి ఆ హీరో ఎవరు అన్నది ప్రస్తుతానిక్ సస్పెన్సే.. మహేష్ మహర్షి పూర్తి కాగానే ఏమాత్రం లేటు చేయకుండా ఈ సినిమా మొదలు పెడతారట. ఈ సినిమాపై మరిన్ని విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.   Related Post

సినిమా స‌మీక్ష