మన్మధుడు-2 ఎవరో తెలుసా..!

August 14, 2018


img

కింగ్ నాగార్జున సూపర్ హిట్ మూవీస్ లో ఒకటైన మన్మధుడు సీక్వల్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మన్మధుడు-2 అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడట. విజయ్ భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన మన్మధుడు మూవీ త్రివిక్రం పెన్ పవర్ ఏంటో చూపించింది. నాగార్జున సరసన సోనాలి బింద్రే, అన్షు నటించిన ఆ సినిమా అప్పట్లో క్రేజీ హిట్ కొట్టింది.

ఇక ఇన్నాళ్లకు మన్మధుడు-2 మీద గురి పెట్టాడు నాగార్జున. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సీక్వల్ గా బంగార్రాజు సినిమా చేస్తున్న నాగార్జున తన తర్వాత సినిమా అదే అని కన్ఫాం చేశాడు. అయితే మన్మధుడు-2 మాత్రం తనయులలో ఒకరి కోసం ప్లాన్ చేస్తున్నారని టాక్. అఖిల్ ఎలాగు ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ చేసే అవకాశం లేదు అందుకే నాగ చైతన్య మరో మన్మధుడు కాబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి మన్మధుడు-2 హీరో ఎవరన్నది అఫిషియల్ గా చెప్పేదాకా సస్పెన్సే. Related Post

సినిమా స‌మీక్ష