వీర రాఘవ టీజర్ టైం వచ్చిందిగా..!

August 13, 2018


img

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కలిసి చేస్తున్న ప్రెస్టిజియస్ మూవీ అరవింద సమేత వీర రాఘవ. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేయగా ఆగష్టు 15న సినిమా టీజర్ రిలీజ్ అవుతుంది అన్నారు. ఇక ఈ టీజర్ కు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా టీజర్ రిలీజ్ టైం కూడా ఇచ్చారు.

టీజర్ టైం తెలియచేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ పై ఇప్పుడు చర్చ మొదలైంది. ఎన్.టి.ఆర్ హీరోయిజం త్రివిక్రం టేకింగ్ లో ఎలా ఉంటుందో జస్ట్ ఆ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. షాడో లుక్స్ లో తారక్ తన ఇంటెన్షన్ ఏంటో తెలియచేస్తున్నట్టు ఉన్నాడు. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం వీర రాఘవతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాలని గట్టి ఫిక్స్ అయ్యాడని చెప్పొచ్చు. 



Related Post

సినిమా స‌మీక్ష