నాని హీరోయిన్ పెళ్లికూతురవుతుంది..!

August 13, 2018


img

నాని అష్టాచమ్మ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగు అమ్మాయి స్వాతి. అప్పటికే బుల్లితెర మీద తన క్యూట్ యాంకరింగ్ తో అలరించిన కలర్స్ స్వాతి మొదటి సినిమా హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమాల్లో నటిస్తూ అలరించిన స్వాతి తమిళంలో కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా సాగకపోవడంతో అమ్మడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది.


కొన్నాళ్లుగా స్వాతి పెళ్లి వార్తలపై కామెంట్స్ వచ్చినా వాటికి ఏమాత్రం రెస్పాండ్ కాని స్వాతి ఏకంగా పెళ్లి ముహుర్తంతో అందరికి షాక్ ఇచ్చింది. వికాస్ అనే బెంగళూరు కుర్రాడితో స్వాతి పెళ్లికి సిద్ధమైందట. మలేషియాలో పైలెట్ గా జాబ్ చేస్తున్న వికాస్ తో స్వాతి కొన్నాళ్లుగా ప్రేమలో ఉందట. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ నెల 30న రాత్రి 7:33 గంటలకు స్వాతి పెళ్లి ముహుర్తమని సమాచారం.  

పెళ్లి తర్వాత స్వాతి ఇక సినిమాలకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే. చేసిన సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిగా ఏమాత్రం స్కిన్ షోకి స్కోప్ ఇవ్వకుండా నటించి మెప్పించింది స్వాతి. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్న ఆమెకు శుభాకాంక్షలు తెలుపుదాం. 



Related Post

సినిమా స‌మీక్ష