గీతా గోవిందం ఎంత తేవాలంటే..!

August 11, 2018


img

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. ఆగష్టు 15న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కోసం గీతా ఆర్ట్స్ 14 కోట్లు పెట్టేశారట. అర్జున్ రెడ్డి క్రేజ్ తో విజయ్ మార్కెట్ పెరిగింది. అందుకే బడ్జెట్ భారీగానే పెట్టేశారు.

గీతా ఆర్ట్స్ మూవీ కాబట్టి డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ ఇలా అన్ని హక్కులు అమ్ముడయ్యాయట. ఇప్పటికే 5 కోట్లు దాకా ఈ రకమైన బిజినెస్ జరిగిందట. అంటే ఇక సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అవ్వాలంటే మాత్రం జస్ట్ మరో 9 కోట్లు రాబడితే చాలు.. నైజాంలో విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి సగానికి పైగా ఇక్కడే వసూళు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మిగతా ఏరియాలు మొత్తం మిగతా సగం రాబట్టేయొచ్చు. మొత్తానికి విజయ్ గీతా గోవిందం కచ్చితంగా మనవాడికి మరో హిట్ వచ్చేలా ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష