నిఖిల్ ముద్ర వేసేది అప్పుడే..!

August 10, 2018


img

యువ హీరో నిఖిల్ సినిమా సినిమాకు తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్ తమిళ సూపర్ హిట్ మూవీ కణితన్ రీమేక్ లో నటిస్తున్నాడు. మాత్రుక దర్శకుడు టి.ఎన్ సంతోష్ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగులో ముద్ర అని టైటిల్ పెట్టారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.   

హీరో పాత్ర జర్నలిస్ట్ కాగా ఫేక్ సర్టిఫికెట్ స్కాం ఎలా ఛేధించాడు అన్నదే ఈ ముద్ర కథ. సినిమా ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది. సినిమాకు రిలీజ్ డేట్లు చాలా అనుకోగా ఫైనల్ గా నంవబర్ 8న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారట. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి తెలుగులో కూడా అదే రేంజ్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష