అను బేబీ ఆగవే అంటున్న చైతు..!

August 10, 2018


img

అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. అను ఇమ్మాన్యుయెల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ అత్త పాత్రలో నటిస్తుంది. మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ అను బేబీ సరే ఆగవే అనే పాట రిలీజ్ చేశారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ లో ఈగోతో కొట్టిమిట్టాడే అనుని తన మాటలతో పడేసే ప్రయత్నం చేస్తున్నాడు చైతు.

సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా మరోసారి ఈ పాటలో చైతు కొత్తగా కనిపిస్తున్నాడని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత నాగ చైతన్య చేసిన మొదటి సినిమా ఇదే.. డైరక్టర్ మారుతి కాబట్టి పక్కా ఎంటర్టైనర్ అని ఫిక్స్ అవుతున్నారు. మరి అను బేబీ ఈగోకి చైతు ఆయింట్మెంట్ ఎలా పనిచేసింది అన్నది ఈ నెల 31న సినిమా వస్తేనే కాని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది. 

Related Post

సినిమా స‌మీక్ష