రేణు దేశాయ్ మళ్లీ వస్తుంది..!

August 10, 2018


img

పవన్ తో బద్రి సినిమాలో ఆడిపాడిన రేణు దేశాయ్ ఆ తర్వత జాని సినిమా కూడా చేసింది. పవన్ పెళ్లాడి ఇద్దరు పిల్లలకు తల్లైన రేణు అతని నుండి విడిపోయింది. ప్రస్తుతం పూణేలో ఉంటున్న రేణు దేశాయ్ ఈమధ్య మళ్లీ వార్తల్లోకి వచ్చింది. లేటెస్ట్ గా రెండో పెళ్లి నిశ్చితార్ధం జరుపుకున్న రేణు తెలుగులో రీ ఎంట్రీకి సిద్ధమైంది. అది హీరోయిన్ గా మాత్రం కాదు ఈసారి రేణు మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే ఎలాంటి కథ తీయాలన్నది నిర్ణయించుకుందట. రేణు తన మొదటి సినిమాగా రైతు సమస్యల మీద సినిమా చేస్తుందని తెలుస్తుంది. దానికి సంబందించిన కథ సిద్ధం చేశారట. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటుగా నిర్మాతగా కూడా రేణు వ్యవహరిస్తుందని తెలుస్తుంది. రేణు దేశాయ్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ అది డైరక్టర్ గా ఎలా ఉండబోతుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష