శ్రీనివాస కళ్యాణం రివ్యూ & రేటింగ్

August 09, 2018


img

రేటింగ్ : 2.5/5

కథ :

చండిఘడ్ లో ఆర్కిటెక్ గా పనిచేసే శ్రీనివాస్ అలియాస్ వాసు (నితిన్) అక్కడే శ్రీదేవి అలియాస్ శ్రీ (రాశి ఖన్నా)ని చూసి ఇష్టపడతాడు. శ్రీ కూడా వాసు ఫ్యామిలీ రిలేషన్స్ చూసి దగ్గరవుతుంది. వీరి స్నేహం ప్రేమగా మారుతుంది. శ్రీ ఫాదర్ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆర్కే (ప్రకాశ్ రాజ్). బిలీనియర్ అయిన ఆర్కే కూతురు ఇష్టపడ్డదని వాసుతో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అయితే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందా వాసు, శ్రీల పెళ్లికి అడ్డుగా మారిన పరిస్థితులు ఏంటి అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న సతీష్ వేగేశ్న మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్ తో శ్రీనివాస కళ్యాణం సినిమా చేశాడు. ఈ కథ చాలా చిన్నది. దాన్ని రెండు గంటల దాకా సాగదీశారు. కథ, కథనాల్లో కేవలం పెళ్లి దాని ప్రాముఖ్యత గురించి లెంగ్తీ డైలాగ్స్ రాసుకున్నారు.

మొదటి భాగం సినిమా ఇంట్రెస్ట్ గా సాగినా సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సీన్స్ కాస్త బోర్ అనిపిస్తాయి. లీడ్ పెయిర్ నటన బాగుంది. సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్ తోనే నడిపించాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. శతమానం భవతి కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చినా అందులో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేశాడు. కాని ఇందులో అది మిస్ అయ్యింది. మాస్ ఆడియెన్స్ కు ఏమాత్రం రుచించనిగా ఈ సినిమా ఉంటుంది. కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మాత్రమే ఇది వచ్చింది.  

నటన, సాంకేతిక వర్గం :

లవర్ బోయ్ గా నితిన్ కెరియర్ లో ఇప్పటివరకు చేయని పాత్రలో అలరించాడు. వాసు పాత్రలో నితిన్ బెస్ట్ అనిపించాడు. ఇక శ్రీదేవిగా రాశి మెప్పించేసింది. ప్రకాశ్ రాజ్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, విద్ధ్యుల్లేక ఇలా అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా స్టార్ కాస్ట్ భారీగా ఉండటంతో సినిమా చాలా కలర్ ఫుల్ గా అనిపిస్తుంది.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగా హెల్ప్ అయ్యింది. సినిమా చాలా కలర్ఫుల్ గా అనిపించడంలో కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. మిక్కి జే మేయర్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ రెండు మాత్రమే బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించింది. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత కావాలో అంత పెట్టేశాడు. కథ, కథనాల్లో దర్శకుడు తన పనితనం చూపించలేదు. శతమానం భవతి లానే చాలా సీన్స్ ల్యాగ్ అయినట్టు అనిపిస్తాయి. కాని ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో అది మిస్ అయ్యింది. 

ఒక్కమాటలో :

శ్రీనివాస కళ్యాణం.. కళ్యాణ మహోత్సవం కుటుంబ సభ్యులకు మాత్రమే..!




Related Post

సినిమా స‌మీక్ష