వీర రాఘవ వస్తున్నాడు..!

August 09, 2018


img

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, రిలీజ్ డేట్ ల పై అఫిషియల్ డేట్లు వచ్చాయి. అనుకున్నట్టుగానే ఆగష్టు 15న అరవింద సమేత టీజర్ వస్తుందట. అక్టోబర్ 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈమధ్యనే సినిమా రిలీజ్ విషయంపై కన్ ఫ్యూజ్ అన్న వార్తలు బయటకు రాగా వాటికి ప్రతిస్పందనగా సినిమా అనుకున్న విధంగా రిలీజ్ అవడం పక్కా అని చెబుతున్నారు. 

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఓ పాత్ర మోడ్రెన్ లుక్ తో మరోపాత్ర రాయలసీమ యాసతో కనిపిస్తుందట. అయితే వీర రాఘవ ఒక్కడా ఇద్దరా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సనసన పూజా హెగ్దె, ఈషా రెబ్బలు నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే సంచలనాలు సృష్టించాలని చూస్తున్నారు చిత్రయూనిట్.  Related Post

సినిమా స‌మీక్ష