సైరాలో గోనగన్నారెడ్డి ఉన్నాడా..!

August 09, 2018


img

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా ఇప్పటికే భారీ హంగులతో వస్తుందని తెలుస్తుండగా చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి దీనికి మరింత కలరింగ్ యాడ్ చేస్తున్నారట. సినిమాలో అమితాబ్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి లాంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ ఓ కేమియో రోల్ ఉంటుందని టాక్.    

రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా బన్ని చేసిన హంగామా అందరి తెలిసిందే. గమ్మునుండవాయ్ అంటూ తన సత్తా చాటిన బన్ని సైరాలో కూడా అలాంటి క్రేజీ రోల్ చేయబోతున్నాడని టాక్. చిరంజీవి అడిగితే బన్ని కాదనే ఛాన్సే లేదు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సైరా సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో ఇంకెన్ని సర్ ప్రైజులు ఉంటాయో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష