'మహర్షి' వచ్చేశాడోచ్..!

August 09, 2018


img

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా టైటిల్ పై కొన్నాళ్లుగా జరుగుతున్న డిస్కషన్స్ కు ఎండ్ కార్డ్ వేశారు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు మహర్షి అని టైటిల్ ఫిక్స్ చేశారు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ క్రేజీగా మారింది. రిషి పాత్రలో మహేష్ మాస్ లుక్ లో అదరగొట్టనున్నాడు. ఇక ఈరోజు మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటుగా టీజర్ కూడా వదిలారు.

స్టైలిష్ లుక్ లో మహేష్ అలా నడుచుకుంటూ వస్తున్న మహర్షి టీజర్ రిలీజ్ చేశారు. చేతిలో ల్యాప్ టాప్.. పక్కన అమ్మాయిలను చూస్తూ చిలిపిగా మహేష్ నడకలో తన గ్రేస్ చూపించాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ మహర్షిలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడట. 2019 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
Related Post

సినిమా స‌మీక్ష