అమ్మడి ఆశలన్ని దానిమీదే..!

August 08, 2018


img

మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మళయాల భామ అను ఇమ్మాన్యుయెల్ మొదటి రెండు సినిమాల ఫలితాలతో ఇండస్ట్రీకి మరో లక్కీ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందని అనుకున్నారు కాని ఆ తర్వాత తెలిసింది అమ్మడిది లక్కీ హ్యాండ్ కాదు ఐరన్ లెగ్ అని. త్రివిక్రం, పవన్ చేసిన అజ్ఞాతవాసి అమ్మడికి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత బన్ని నా పేరు సూర్య నిరాశపరచింది. ఇక చేతిలో ఉన్న శైలజా రెడ్డి అల్లుడు ఒక్క సినిమా మీదే భారీ ఆశలు పెట్టుకుంది అను.

ఈ సినిమా హిట్ అయితే మరో రెండు ఆఫర్లు వెయిట్ చేస్తున్నాయి. వరుణ్ తేజ్, సాగర్ చంద్ర డైరక్షన్ లో మూవీ ఒకటికాగా.. వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో సినిమా ఒకటి. ఈ రెండు ఆఫర్లు అమ్మడికి రావాలి అంటే మాత్రం శైలజా రెడ్డి అల్లుడు హిట్ అవ్వాల్సిందే. అను ఫేట్ మార్చబోతున్న నాగ చైతన్య సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష