గోవిందం హిట్ కొడితే లక్కీ ఛాన్స్..!

August 08, 2018


img

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను బన్ని వాసు నిర్మిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక జోడిగా నటించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా దర్శకుడికి అల్లు అరవింద్ ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చాడట. ఈ సినిమా అనుకున్న రేంజ్ హిట్ కొడితే తర్వాత సినిమా అల్లు అర్జున్ తో ఛాన్స్ ఇస్తానని చెప్పాడట.

నిజంగా పరశురాంకు ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. సోలో, యువత, శ్రీరస్తు శుభమస్తు సినిమాల తర్వాత పరసురాం చేసిన గీతా గోవిందం మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. గోవిందం హిట్ పడితే మాత్రం పరశురాం కు బిగ్ బొనాంజా తగిలినట్టే. ఇక ఒక స్టార్ అవకాశం ఇచ్చాడు అంటే ఆ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే పరశురాం కూడా స్టార్ డైరక్టర్ అయినట్టే లెక్క. 


Related Post

సినిమా స‌మీక్ష