మెగాస్టార్ జోడీగా అనుష్క..!

August 08, 2018


img

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సెట్స్ మీద ఉంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమా మొదలవనుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. సీనియర్ హీరోలకు జోడీగా హీరోయిన్స్ కష్టమవుతున్నారు. కుర్ర హీరోయిన్స్ ఎవరు వారి పక్కన నటించేందుకు సుముఖంగా లేరు. అందుకే సీనియర్ హీరోయిన్స్ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు. ఈ క్రమంలో చిరు పక్కన అనుష్క అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఆమెను ఎంపిక చేశారట. ఆల్రెడీ కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన మిర్చి సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. చిరుతో స్టాలిన్ లో ఐటం సాంగ్ చేసింది అనుష్క. మరి ఈ జంట ఎలా అలరించనుందో చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష