'మిస్టర్ మజ్ను' వర్క్ అవుట్ అయ్యేనా..!

August 07, 2018


img

అక్కినేని యువ వారసుడు అఖిల్ తన 3వ సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో చేస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం యూరప్ లోనే జరుపుకుంటుంది. సినిమాకు టైటిల్ గా మిస్టర్ మజ్ను అని పెట్టే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. నాగార్జున మజ్ను సినిమా నిరాశ పరచింది.

రీసెంట్ గా నాని మరోసారి మజ్ను టైటిల్ తో సినిమా చేశాడు. మరి ఏ టైటిల్ దొరకలేదు అన్నట్టు మిస్టర్ మజ్ను అని పెట్టడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. మిస్టర్ మజ్ను టైటిల్ చూస్తే ఇది కూడా ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. తొలి సినిమా తొలిప్రేమ హిట్ తో సినిమాపై ఆసక్తి పెంచిన వెంకీ అట్లూరి ఈసారి అఖిల్ రేంజ్ కు తగిన హిట్ అందిస్తాడో లేదో చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష