హ్యాపీ వెడ్డింగ్ రివ్యూ & రేటింగ్

July 28, 2018


img

రేటింగ్ : 2.5/5

కథ :

యాడ్ ఫిలిం మేకర్ అయిన ఆనంద్ (సుమంత్ అశ్విన్), శారీ డిజైనర్ అయిన అక్షర (నిహారిక) ప్రిచయం ప్రేమగా మారుతుంది. వీరి పెళ్లికి పేరెంట్స్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో పెళ్లికి సిద్ధమవుతారు. ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. ఇదే టైంలో అక్షర పాత స్నేహితుడు విజయ్ (రాజా) రావడంతో తను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా.. ఆనంద్, విజయ్ లలో ఎవరు తనకు కరెక్ట్ అనే కన్ ఫ్యూజన్ లో ఉంటుంది. చివరకు అక్షర ఎవరిని పెళ్లాడింది అన్నదే సినిమా కథ.  

విశ్లేషణ :

హ్యాపీ వెడ్డింగ్ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా అబ్బాయి, అమ్మాయిల మధ్య ఆలోచన ఎలా ఉంటుంది చూపించారు. కథలో హీరోయిన్ పాత్ర కన్ ఫ్యూజన్ తో ఉండటం కథకు బలాన్ని ఇచ్చింది. అయితే కొత్త కథ అని చెప్పలేం కాని అనుకున్న కథకు రాసుకున్న కథనం ఇంప్రెస్ చేస్తుంది.  

మొదటి భాగం కాస్త సరదాగా సాగగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా నడుస్తుంది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అయినా భారీ డైలాగ్స్ ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడతాయి. సుమంత్, నిహారికల నటన సినిమాకు ప్లస్ అయ్యింది. లవ్ సీన్స్ అన్ని దర్శకుడు మెచ్యుర్డ్ గా రాసుకోగా లీడ్ పెయిర్ కూడా అంతే బాగా చేశారు. యువత ఆలోచనలకు అద్దం పట్టేలా దర్శకుడు ఈ సినిమాను తీశాడు. నరేషన్ మరీ స్లో అవడంతో సినిమా అక్కడక్కడ బోర్ కొడుతుంది. క్లైమాక్స్ మళ్లీ అందరిని అలరిస్తుంది. ఒక మనసు తర్వాత నిహారిక చేసిన ఈ ప్రయత్నం కొంతమేర సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. 

నటన, సాంకేతికవర్గం : 

సినిమా మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. నిహారిక తన పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. కన్ ఫ్యూజన్ తో కూడిన పాత్రలో మెగా డాటర్ మెప్పించింది. సుమంత్ అశ్విన్ కూడా బాగానే చేశాడు. లవ్ సీన్స్ లో మెచ్యుర్డ్ ఇద్దరు బాగా చేశారు.  మురళి శర్మ, నరేష్ పాత్రలు అలరించాయి. రాజా కూడా చిన్న పాత్రే అయినా ఓకే అనిపించాడు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది.. సినిమా అందంగా వచ్చేందుకు కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించింది. ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ బాగుంది. ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తో దర్శకుడిగా ప్రతిభ చాటిన లక్ష్మణ్ కార్య హ్యాపీ వెడ్డింగ్ తో ఎంచుకున్న కథ దానికి రాసుకున్న కథనం ఇంప్రెస్ చేశాయి. అయితే నరేషన్ మాత్రం స్లో అయ్యింది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

హ్యాపీ వెడ్డింగ్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం..!



Related Post

సినిమా స‌మీక్ష