వెంకటేష్ అలా.. వరుణ్ తేజ్ ఇలా..!

July 20, 2018


img

మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రెండు మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్-2 కాగా.. మరోటి బాబి డైరక్షన్ లో రాబోతున్న సినిమా. ఎఫ్-2లో వరుణ్ తేజ్, బాబి సినిమాలో నాగ చైతన్య వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అనీల్ రావిపుడి సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకుంటుంది. ఎఫ్-2 అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్.

ఇద్దరు పాత్రల్లో ఒకరు ఫన్ గా ఉంటుండగా.. మరొకరు ఫ్రస్ట్రేషన్ గా ఉంటారట. మరి ఇందులో ఫన్ గా వెంకటేష్, ఫ్రస్ట్రేషన్ వ్యక్తిగా వరుణ్ తేజ్ కనిపిస్తాడని చెప్పొచ్చు. సినిమాలో హీరోయిన్స్ గా తమన్నా, మెహెరీన్ కౌర్ సెలెక్ట్ చేశారు. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష