బిగ్ బాస్ లీక్స్.. సామ్రాట్ ఇంటికేనా..!

July 19, 2018


img

బిగ్ బాస్ సెకండ్ సీజన్ లీకులు సంచలనంగా మారుతున్నాయి. మొదటి సీజన్ ముంబై పరిసర ప్రాంతాల్లో సెట్ వేశారు. అక్కడ ఏం జరుగుతుంది అన్నది కేవలం టివిల్లో మాత్రమే చూసేవారు. అయితే బిగ్ బాస్-2 హైదరాబాద్ లో సెట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెకండ్ సీజన్ 2 సెట్ వేయడం జరిగింది. మన దగ్గరే అవడం వల్ల బిగ్ బాస్ లీకులు కూడా సంచలనంగా మారుతున్నాయి. 


ఈ వారం ఎలిమినేషన్ ఎవరన్నది ఆదివారం తెలియాల్సి ఉండగా ఈసారి నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో సామ్రాట్ బిగ్ బాస్ హౌజ్ వదిలి వెళ్తాడని తెలుస్తుంది. దీనికి సంబందించిన ఓటింగ్ గ్రాఫ్ పిక్స్ లీక్ అయ్యాయి. ఈ లీక్స్ వల్ల బిగ్ బాస్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. అసలే టి.ఆర్.పి రేటింగ్ తక్కువగా వస్తుందని అనుకుంటున్న ఈ షోకి లీకుల పర్వంతో వారికి భారీ లాస్ తెచ్చేలా కనిపిస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష