శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ టీజర్..!

July 19, 2018


img

నితిన్, రాశి ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి తర్వాత దర్శకుడు చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. కాన్సెప్ట్ టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది అని చూపించారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.

త్రివిక్రం అఆ తర్వాత నితిన్ చేసిన లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు నిరాశపరచాయి. అందుకే ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు నితిన్. తొలిప్రేమ హిట్ తర్వాత రాశి ఖన్నా చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై చాలా హోప్స్ పెట్టుకుంది. మరి ఈ సినిమా శతమానం భవతి లానే సంచలన విజయం అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.  





Related Post

సినిమా స‌మీక్ష