సింగర్ సునీత మరో పెళ్లికి రెడీనా..!

July 19, 2018


img

తెలుగు సంగీత ప్రియులను తన పాటలతో అలరించే సింగర్ సునీత అందరికి సుపరిచితురాలే. ఎంతో టాలెంట్ ఉన్నా సరే ఆమెకు సింగర్ గా తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. గాయనిగా పాటలు పాడటమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా సునీత చాలా ఫేమస్ అయ్యింది. పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే సునీత తన భర్త నుండి విడిపోయిన సంగతి చెప్పింది. ఇద్దరు పిల్లలు ఉన్న సునీత ప్రస్తుతం సింగిల్ మదర్ గానే లైఫ్ లీడ్ చేస్తుంది.

లేటెస్ట్ గా సునీత మరో పెళ్లికి సిద్ధమయినట్టు తెలుస్తుంది. ఒంటరి జీవితంలో కష్టాలను అనుభవిస్తున్న ఆమె, తోడు కోసం ఎదురుచూస్తుందట. ప్రస్తుతం సునీత రెండో పెళ్లి వార్త సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతన్నది తెలియదు కాని సునీత మరో పెళ్లికి రెడీ అన్న వార్త విని అందరు షాక్ అవుతున్నారు.      Related Post

సినిమా స‌మీక్ష